తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా కనిపించనున్నాడు.