ఏపీ వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఎన్టీఆర్ సతీమని అయిన లక్ష్మీ పార్వతి ఇటీవల గత కొన్నిరోజుల క్రితం నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి విమర్షలు చేసారు. ఆమే చేసిన వ్యాఖ్యలు అంతా అబద్దం అని అన్నారు.
అన్నీ అబద్దాలే..
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిండు అసెంబ్లీలో ద్రౌపదిని అవమానించినట్లుగా తన శీలంపై నింధలు వేసారంటూ తన వ్యక్తిత్వం పై దారుణంగా మాట్లాడారంటూ నారా భువనేశ్వరి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ రికార్డులను పరిశీలిస్తే ఆమెను అసెంబ్లీలో ఎవరు అవమానించారో లేదో నిజాలు బయటపడతాయని, సానుభూతి కోసమే ఆమె ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని లక్ష్మీపార్వతమ్మ అన్నారు.
సింపతికోసం డ్రామాలు..
చంద్రబాబు కుంటుంభం అతా అభద్దాలతోనే నడుస్తుందని నాకు అనిపిస్తుందని అన్నారు. నీవు మాములు వ్యక్తివి కావు స్వయాన ఎన్టీఆర్ కుమార్తెవు అలా మాట్లాడి నీ విలువ తగ్గించుకోవద్దని అన్నారు. కావాలని ప్రజల్లో సింపతి క్రియేట్ చేయడం కోసం ఇలా అబద్దాలు మాట్లాడటం మంచిది కాదని లక్ష్మిపార్వతి అన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా సమాజంలో ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలన అన్నారు. వ్యక్తిత్వంపై, క్యారెక్టర్ మీద బజార్లలో ప్రచారం చేసింది నీ కొడుకు, ఆమే భర్త అని ఆరోపించారు. మీ రాజకీయ ప్రయోజనాలకోసం నన్ను బజార్లో పెడతారా అని ముందుగా నీ భర్త, నీ కొడుకును అడగమని అన్నారు.
ఆనాడు గుర్తురాలేదా..
గతంలో చంద్రబాబు నాయుడు వేరే పార్టీల్లో ఉన్న మహిళల మీద మాట్లాడినప్పుడు నీకు గుర్తురాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు నువ్వు నీ భర్త నీ కొడుకుని అడిగి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అన్నారు. మహిళలు అందరు సమానమే కదా అది మర్చిపోయి ఎదో సింపతితో రాజకీయ ప్రయోజనం పొందడం కోసం నిందలు వేస్తు ఎవరు నమ్మరని అన్నారు.