మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలుకానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు యువత సన్నద్ధమయ్యారు. ఈ మేరకు పోలీసు శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్స్ పరిధిలో చెక్‌పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్‌లు చేపట్టాలని నిర్ణయించారు.