ఏపీలో పెన్షన్లు రూ.3వేలకు పెంచిన నేపథ్యంలో 66 లక్షల మంది లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ రాశారు. దీంతో రేపు పెన్షన్ డబ్బులతో పాటు ఈ లేఖలను వలంటీర్లు పెన్షనర్లకు అందిస్తారు. ‘ప్రజల ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నా. కొత్తగా 28.35 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశాం. ఆదివారం, సెలవైనా 1వ తేదీన వలంటీర్లు పెన్షన్లు అందజేస్తారు. మీ ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా’ అని సీఎం లేఖలో పేర్కొన్నారు