ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఆలస్య రుసుంతో సహా ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. నామినల్ రోల్స్‌లో తప్పులు సరిదిద్దుకునే గడువు కూడా శనివారంతో పూర్తయ్యింది. దీంతో పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 10,07,097 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు.