డార్లింగ్ ఫ్యాన్స్ కు పొంగల్ గిఫ్ట్.. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్..

సలార్ సీజ్ ఫైర్- పార్ట్ 1 కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో రెండో వారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. పైగా న్యూ ఇయర్ టైమ్ కావడం, పెద్ద సినిమాలేవీ లేకపోవడం సలార్ కు కలిసొచ్చింది. ఇదే జోష్ లో ప్రభాస్ నెక్ట్స్ మూవీపై ఒక అప్డేట్ వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. షూటింగ్ మాత్రం సైలెంట్ గా జరిగిపోతోంది. తాజాగా.. ఈ సినిమాపై ఒక అధికారిక ప్రకటన వచ్చింది. అఫీషియల్ గా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ X లో ఒక పోస్ట్ చేసింది.

 

2024 సంక్రాంతి కానుకగా డార్లింగ్ ఫ్యాన్స్ కు ఈ సినిమాపై అప్డేట్ ను ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అఫీషియల్ గా ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ రావడంతో.. అంచనాలు పెరిగాయి. “రాజా డీలక్స్ ” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా లేక మరో టైటిల్ ను ప్రకటిస్తారా తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

 

కాగా.. ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇలాంటి సినిమాలు తీయడంలో మారుతికి ఎవరూ సాటిలేరు. ప్రభాస్ సినిమాల్లో యాక్షన్ ఎక్కువ, కామెడీ తక్కువగా ఉంటాయి. అలాంటి స్టార్ హీరోతో మారుతి.. ఏ రేంజ్ లో కామెడీ పండిస్తారో చూడాలి. ఇక ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా..సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను తెరకెక్కిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *