వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. శక్తిమంతమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రస్తుతం ఉన్న జియో ఇంటెలిజెన్స్ కూడా సరిపోదని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉన్నదానికంటే పది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే జియో ఇంటెలిజెన్స్ కావాలని ఎస్.సోమనాథ్ తెలిపారు. అలాగే జియో ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన శాటిలైట్లపై కూడా దృష్టి సారించిందన్నారు.