ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమిగా వెళ్తున్నట్లుగా ప్రకటించాయి. బీజేపీ కలుస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీజేపీ మెల్లగా కూటమిలో భాగం అయ్యేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి పండగ పూర్తయ్యేలోపు బీజేపీ హైకమాండ్ కూటమి సంగతి తేల్చనుంది.