ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు దాదాపుగా ఖరారైంది. మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు సీఎం జగన్ మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పిఠాపురం, పి.గన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, రామచంద్రపురం స్థానాల్లో సిట్టింగ్ లను తప్పించి కొత్త వారికి జగన్ ఛాన్స్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.