Airtel 5G యూజర్లకు కీలక అప్డేట్.. హాట్‌స్పాట్ వినియోగంపై కొత్త నిబంధనలు!

భారతీ ఎయిర్‌టెల్ తన 5G వినియోగదారులకు సంబంధించి కీలక మార్పులు చేసింది. 2023లో ప్రవేశపెట్టిన అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ను మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఇతర పరికరాలకు షేర్ చేయడంలో కొందరు వినియోగదారులు ఇటీవల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు కూడా వైరల్ కావడంతో ఈ అంశంపై స్పష్టత అవసరమైంది.

ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తన అధికారిక వెబ్‌సైట్‌లోని నిబంధనలు, షరతులు (Terms & Conditions) పేజీని అప్‌డేట్ చేసింది. హాట్‌స్పాట్ ద్వారా 5G డేటా వినియోగానికి సంబంధించిన తాజా నిబంధనలను అధికారికంగా వెల్లడిస్తూ వినియోగదారులకు పూర్తి స్పష్టత ఇచ్చింది.

కొత్త మార్పులతో అన్‌లిమిటెడ్ 5G డేటా వినియోగంలో ఏ పరిస్థితుల్లో హాట్‌స్పాట్ సదుపాయం అందుబాటులో ఉంటుందో, ఎలాంటి పరిమితులు వర్తిస్తాయో కంపెనీ వివరించింది. దీంతో 5G సేవలను ఉపయోగిస్తున్న వినియోగదారులు తాజా నిబంధనలను తెలుసుకుని వాటి ప్రకారం సేవలను వినియోగించుకోవాలని సూచిస్తోంది.