ప్రపంచం నెత్తిన మరో పిడుగు…!

మహమ్మారి కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోలేక, వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక ప్రపంచ మానవాళి బెంబేలెత్తుతోంది. ఈ తరుణంలో చైనాలో మరో ప్రాణాంతక వైరస్‌ బయటపడినట్టు ఓ మీడియా రిపోర్టు వెల్లడించింది. హంటా వైరస్‌గా పిలవబడే ఈ వైరస్‌ బారిన పడి చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడని గ్లోబల్‌ టైమ్స్‌‍ మీడియా సంస్థ పేర్కొంది. హంటా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను చనిపోవడం కలకలం రేపుతోంది.

గ్లోబల్‌ టైమ్స్‌ ప్రకారం.. ఓ వ్యక్తికి హంటా వైరస్‌ లక్షణాలు బయటపడటంతో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అతనికి హంటా వైరస్‌ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయింది. అయితే, అతడు పని నిమిత్తం షాండాంగ్‌ ప్రావిన్స్‌కు చార్టర్డ్‌ బస్సులో పయమవ్వగా దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఇంకో షాకింగ్‌ విషయమేంటంటే.. మరో 32 మంది కూడా ఇదే వైరస్‌ బారిన పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అయితే, వారి రిపోర్టులు రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *