పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా పవన్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేయనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూవీలో పవర్ స్టార్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు.