కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ప్రభావంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,220 వరకు పెరగడంతో నగలు కొనుగోలు చేయాలనుకున్న వారికి అదనపు భారం పడింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,000, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,750గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,34,900గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచడం, డాలర్ మారకపు విలువలో హెచ్చుతగ్గులు కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,60,000కు చేరగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ.2,50,000గా నమోదైంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి బంగారం, వెండి ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.