ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ దీనిపై వేటు వేస్తున్నట్లు తెలిపింది. ‘ఈ సంస్థను ఉపా చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఇస్లామిక్ పాలనను ఏర్పాటు చేసేందుకు ప్రజలను రెచ్చగొడుతోంది’ అని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు.