బొగ్గుగనుల్లో ఎగిరిన ఎర్ర జెండా..

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం AITUC సత్తా చాటింది. మెజార్టీ స్థానాల్లో INTUC గెలిచినప్పటికీ వచ్చిన ఓటింగ్‌ శాతాన్ని బట్టి AITUCని విజేతగా ప్రకటించారు. దీంతో AITUC నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి.

 

 

సింగరేణి పరిధిలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. అందులో 5 చోట్ల AITUC, ఆరు చోట్ల INTUC విజయం సాధించాయి. బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో AITUC విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని ఆర్జీ వన్‌, టు ఏరియాల్లో AITUC , ఆర్జీ త్రీలో INTUC విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్‌ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో INTUC గెలుపొందింది.

 

ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 39 వేల 773 ఓట్లకు గాను 37 వేల 468 ఓట్లు పోలయ్యాయి. 94.20 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువగా శ్రీరాంపూర్‌, ఆర్జీ త్రీ ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *