ఉద్యోగులకు పేటీఎం షాక్.. ఒకేసారి వెయ్యిమంది ఔట్..

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్ధ పేటీఎం ఉద్యోగులకు కొత్త సంవత్సరం వేల భారీ షాకిచ్చింది. పేటీఎం మాతృసంస్ధ వన్97 సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించింది. కాస్ట్‌ కటింగ్‌.. ఎఫీషియన్సీ పెంపులో భాగంగా దేశంలో పలు ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని తొలగించినట్లు సమాచారం.

 

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వైపు అడుగులు వేస్తోన్న పేటీఎం ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కంపెనీ నిర్వహణ కాస్ట్‌లో 10 శాతం తగ్గుతుందని పేటీఎం చెప్పడం గమనార్హం. దీనివలన ఎఫీషియన్సీ కూడా రెట్టింపు అవుతోందని కంపెనీ చెబుతుంది.

 

“మేము ఊహించిన దాని కంటే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ డెలివరీ చేసినందున మేము ఉద్యోగుల ఖర్చులలో 10-15 శాతం ఆదా చేసుకోగలుగుతాము. అదనంగా, మేము ఏడాది పొడవునా పనితీరు లేని కేసులను నిరంతరం మూల్యాంకనం చేస్తాము, ”అని పేటీఎం ప్రతినిధి తెలిపారు. వచ్చే ఏడాది పేటీఎం మరో 15 వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *