ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డే ప్రధాన అర్హత అంటున్న విషయంపై ఆయన సందేశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంకా లక్షలాది కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వం తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో? ప్రజలకు వివరించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.