2024 రిపబ్లిక్ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..

2024 భారత దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌ హాజరుకానున్నారు. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించినట్లు అమెరికా రాయబారి అధికారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. అయితే వివిధ కారణాలు వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని జో బైడెన్ వెల్లడించారు. ఈ కారణంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడిని రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది.

 

గతఏడాది జూలైలో పారిస్‌లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇండియాలో జరిగిన జీ20 సమావేశాలకు ప్రాన్స్ ప్రధానమంత్రి హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీతో కీలక చర్చలు జరిగాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలపడిందన్నారు. గత ఏడాది ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్ కు మోదీ హాజరుకావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *