అమెరికాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే 86 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1300 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికానే వరల్డ్ టాపర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 285 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల్లోనే అమెరికాలో 30 వేల కేసులు నమోదయ్యాయి.