2013లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం కన్న లడ్డు తిన్నా ఆసయ్య ఫేం సేతురామన్ (36) చిన్న వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు. వృత్తిరీత్యా ఆయన చర్మవ్యాధి నిపుణుడు కాగా, అనేక మంది కోలీవుడ్ నటులతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకున్నాడు. తమిళ హాస్యనటుడు హీరో సంతానంతో చాలా సన్నిహితంగా ఉంటారు సేతురామన్. వాలిబా రాజా (2016), సక్కా పోడు పోడు రాజా (2017), మరియు 50/50 (2019) వంటి తమిళ చిత్రాలలో నటించి ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఆయన మృతి చెందాడనే వార్త తమిళ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సేతురామన్ ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్ధించారు. సేతురామన్‌కి భార్య, ఒక బిడ్డ ఉన్నారు.