ఈ పుట్టినరోజుకు నాకు మీరిచ్చే బ‌హుమ‌తి ఇదే

నేడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే అన్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఏడాది ఆయ‌న బర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు భారీ ఎత్తున సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో పాటు ర‌క్త దానాలు చేస్తుంటారు. కొంద‌రు అభిమానులు ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర‌కి వెళ్లి డైరెక్ట్‌గా విషెస్ అందిస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు ఇంటికే పరిమితం కావాల‌ని చ‌ర‌ణ్ త‌న అభిమానుల‌ని కోరారు.

అర్ధరాత్రి నుండి మీరు పంపే శుభాకాంక్ష‌ల చూసి నేను ఆశ్చ‌ర్య‌పోతున్నాను. ప్ర‌స్తుతం దేశం మొత్తం క‌రోనా వైర‌స్ క‌ర్ఫ్యూ న‌డుస్తోంది. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌లో భాగంగా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ని బ‌య‌ట‌కి రావొద్ద‌ని ఆదేశాలు ఇచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని అంద‌రు ఇళ్ళ‌ల్లోనే ఉండండి.  లాక్ డౌన్ ముగిసేవరకు బయటికి రావొద్దు. ఇదే ఈ పుట్టినరోజుకు మీరంతా నాకిచ్చే పెద్ద బహుమతి అన్నారు రామ్ చ‌ర‌ణ్ . దానికి అభిమానులు సైతం మీ సూచనను తప్పక పాటిస్తాం అన్నయ్య అంటూ స్పందిస్తున్నారు. ఇకపోతే చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించిన స‌ర్‌ప్రైజ్ మ‌రి కొద్ది నిమిషాల‌లో రానుంది.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *