అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

పూర్తిస్థాయిలో కరోనా విజృంభించినా అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం అన్నింటికీ 100 శాతం సంసిద్ధంగా ఉన్నం. ధైర్యం కోల్పోయి లేము. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి సోకిన వారికి అందిస్తున్న చికిత్స సరళిని పరిశీలిస్తే 80.9 శాతం మంది స్వల్ప అనారోగ్యానికి గురవుతుండటంతో హోం ఐసోలేషన్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నరు. వారు బతకడానికి అవకాశం ఎక్కువ. అలాగే విషమంగా ఉన్న 13.8 శాతం మంది, తీవ్ర విషమం అవుతున్న 4.8 శాతం మందికే ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నరు. 13.9 శాతం మందిని ఐసోలేషన్‌ వార్డుల్లో, తీవ్రంగా విషమించిన 4.8 శాతం మందిని ఐసీయూల్లో పెట్టి చికిత్స అందిస్తున్నరు.

ఈ లెక్కన రాష్ట్రంలో రోగం బాగా ప్రబలితే మన సంసిద్ధతపై బుధ, గురువారాల్లో ఆరోగ్య మంత్రి, కార్యదర్శి, సీఎస్‌తో కలసి లోతుగా అధ్యయనం చేశాం. ఇంకొకరిపై ఆధారపడకుండా మన స్వశక్తితో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న మన వనరులు, వైద్యులపై లెక్క తేల్చినం. 8 వేల మంది ఐసోలేషన్‌ వార్డులో ఉండేలా ఏర్పాటు చేసుకున్నం. సుమారు 1,400 ఐసీయూ బెడ్స్‌ రెడీ చేసి పెట్టుకున్నం. గచ్చిబౌలి స్టేడియం, గాంధీ మెడికల్‌ కళాశాల, కింగ్‌ కోఠి ఆస్పత్రి రెండు రోజుల్లో సిద్ధం చేస్తున్నం. 500 వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చినం. మొత్తం 11 వేల ఐసోలేషన్‌ బెడ్స్, ఐసీయూ బెడ్స్‌తో పాటు మరికొన్ని బెడ్స్‌ను సిద్ధం చేస్తున్నం.ఈ లెక్కన స్వల్పంగా ఆరోగ్యం విషమించే 80 శాతం మంది అంటే 60 వేల మందికి పాజిటివ్‌గా తేలినా ఇళ్ల వద్ద చికిత్స అందించేందుకు సిద్ధమవుతున్నం’అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *