తెలంగాణ : లాక్ డౌన్ నేపథ్యంలో ఉచిత బియ్యం , నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వ సహాయం రూ.1500 నగదు తెలంగాణ ప్రభుత్వం, ఇస్తున్నామని పేర్కొంది . అయితే నగదు బ్యాంకు ఖాతాలో జమ జరుగలేదా..? మీ కార్డులోని హెడ్ ఆఫ్ ఫ్యామిలీ(మహిళ) ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమై ఉన్నా… నగదు జమ కాలేదా? రెండు మూడు బ్యాంక్ ఖాతాలుంటే నగదు ఏ ఖాతాలో జరిగిందో తెలియదా? ..పరేషాన్‌కావల్సిన పనిలేదు. ఆహార భద్రత కార్డుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక ల్యాండ్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ల్యాండ్ ఫోన్ 040–23324614, 23324615 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆయా నెంబర్లకు ఫోన్ చేసి మీ ఆహార భద్రత కార్డు కొత్త నంబర్ చెబితే సరిపోతుంది. మీ నగదు బ్యాంక్ ద్వారా లేదా పోస్టాఫీస్‌లో జమ అయిందా..? కాలేదా ? ఆన్‌లైన్‌లో పరిశీలించి తెలియజేస్తారు. బ్యాంక్‌లో జమ జరిగితే కుటుంబంలోని ఎవరి ఖాతాలో, ఎ బ్యాంక్‌లో జమ జరిగిందో వివరిస్తారు. బ్యాంక్‌లో పెండింగ్ ఉంటే దానికి గల స్టేటస్ తెలియజేస్తారు. బ్యాంక్ ఖాతా లేకుంటే పోస్టల్ ద్వారా నగదు జమ అయింది లేనిది కూడా తెలియ జేస్తారు. ఒక వేళ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీసుల్లో కూడా నగదు జమ కాకుంటే ఎందుకు జమ కాలేదో స్టేటస్ వివరిస్తారు.