కొండగట్టు అంజన్న నిత్యాన్నదాన సత్రంకు విరాళం.

తేది :15-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా : మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత అన్నప్రాసనకై ఓ భక్తుడు తన వంతుగా బుధవారం విరాళాన్ని అందజేశారు. వేములవాడకు చెందిన అమరగొండ కిషన్ నిత్యాన్నదాన సత్రానికి రూ. 80 వేలు విరాళంగా ఆలయ ఏఈఓ హరిహరనాథ్ కు అందజేశారు. అంతకముందు వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *