ఐపీఎల్ 2024 మినీ వేలం.. లిస్టులో 214 మంది భారత్ ప్లేయర్లు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 2024 కి అంతా సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఐపీఎల్ వేలాన్ని దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. నచ్చిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు టీమ్స్ అన్నీ సిద్దంగా ఉన్నాయి. ఈ సారి వేలంలో ఆక్షనీర్‌గా మల్లికా సాగర్ వ్యవహరించనుంది. ఐపీఎల్ వేలంలో ఆక్షనీర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కనుంది. కోకా-కోలా ఎరీనాలో ఈ వేలం జరగనుండగా.. భారతదేశం వెలుపల వేలం జరగడం ఇదే మొదటిసారి.

 

ఇప్పటికే ఆయా టీమ్స్ ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్ ప్రాసెస్ పూర్తి చేయగా.. ఇప్పుడు ఫ్రాంచైజీల దగ్గర మిగిలిన డబ్బుతో వేలంలో కొత్తవాళ్లను దక్కించుకొనున్నారు. 2024కి సంబంధించిన ఐపీఎల్ వేలం కోసం ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ ఏడాది నవంబర్ 30తోనే ముగిసింది. ఈ వేలం కోసం మొత్తం 333 మంది క్రికెటర్లు నమోదు చేసుకోగా.. అందులో 214 మంది భారతీయులు.. 119 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే అన్ని జట్లలో కలిపి మొత్తం 77 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 30 స్లాట్లను విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు.

 

ఈ నేపథ్యంలో 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు వేలంలో ఎవర్ని దక్కించుకుంటాయాని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వేలంలో ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, మిచెల్ స్టార్క్.. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ డారిల్ మిచెల్, వనిందు.. హసరంగా, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్ వంటి పలువురు పాపులర్ ప్లేయర్లకు భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ దగ్గర అత్యధికంగా భారీ ఫండ్స్ ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర అతి తక్కువ ఫండ్స్ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *