పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది నిజానికి ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల చేయాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు సినిమా విడుదల గురించి చిత్ర బృందం మాత్రం ఎక్కడ అధికారక ప్రకటన వెల్లడించలేదు.
ఈ సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని సమాచారం. ప్రొఫెసర్ నుంచి సైనికుడు, స్పై ఏజెంట్ గా ప్రభాస్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా మూడు విభిన్నమైన పాత్రలలో ప్రభాస్ కనిపించబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మాత్రం తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారనే విషయం ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పాలి.
పీరియాడిక్ వార్ డ్రామాగా..
ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రలలో సందడి చేసిన ప్రభాస్ మొదటిసారి ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఫౌజీ సినిమా 1940ల నాటి బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగే పీరియాడిక్ వార్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.భారీ విజువల్స్‌తో కూడిన యాక్షన్-ఎమోషనల్ ఫిక్షనల్ కథగా,దేశం కోసం ప్రాణాలర్పించే ఒక సైనికుడి కథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
ప్రభాస్ జోడిగా ఇమాన్వి…
ఇక ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా నటి ఇమాన్వి (Imanvi)నటించబోతున్నారు. ఈమెకు ఇది డెబ్యూ సినిమా కావటం విశేషం మొదటి సినిమానే ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోతో చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ మినహా ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్ వెల్లడి కాలేదు.. ఇప్పటికే ఈ సినిమా 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కీలక సమాచారాన్ని చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు .ఈ సినిమా 2027 మార్చ్ 25 న విడుదల కాబోతోంది. మరోవైపు కల్కి 2 షూటింగ్ లో కూడా ప్రభాస్ బిజీగా ఉన్నారు.