క్రికెట్ బెట్టింగ్‌కు దూరంగా ఉండండి – మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.

తేది:30-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ పటేల్ క్రాంతి కుమార్ క్రికెట్ బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరం. ఇందులో పాల్గొనడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు.
​బెట్టింగ్ వ్యసనం వల్ల మీ కష్టార్జితం మొత్తం పోయే ప్రమాదం ఉంది. ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది.
​బెట్టింగ్‌కు పాల్పడే వారిపై పోలీస్ కేసులు నమోదు చేయబడతాయి.నేరం రుజువైతే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఇది మీ భవిష్యత్తును మరియు మీ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీస్తుంది.
​క్రికెట్ అనేది ఒక వినోదభరితమైన క్రీడ, కానీ దానిని జూదంగా మార్చుకోవడం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. క్షణికమైన ఆశ కోసం జీవితాంతం పశ్చాత్తాపపడకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *