బిగ్‌బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి బిగ్ బాస్ విన్నర్‌ను అనౌన్స్ చేసిన తర్వాత బస్సులు, కంటెస్టెంట్ల కార్లపై ప్రశాంత్ అభిమానులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా నమోదు చేశారు. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. పలువురు అభిమానులపై కూడా FIR నమోదు చేశారు.