సమాజ సేవ – జర్నలిజంలో విశిష్ట కృషికి పారువెల్లి అంక విజయ దుర్గ భవానికి “కలం రత్న జాతీయ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం”.

తేది: 27-03-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళి కృష్ణ.

హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, మానవ హక్కుల పరిరక్షకురాలు పారువెల్లి అంక విజయ దుర్గ భవాని గారికి “కలం రత్న జాతీయ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం” ప్రకటించినట్లు వసుంధర విజ్ఞాన వికాస మండలి (వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్) ప్రతినిధులు తెలిపారు.
పారువెల్లి అంక విజయ దుర్గ భవాని సమాజ సేవలో విశేష కృషి చేస్తూ, మానవ హక్కుల పరిరక్షణలో చురుకుగా పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. అదేవిధంగా మీడియా రంగంలో సైతం చురుకుగా వ్యవహరిస్తూ న్యూస్‌పేపర్ మరియు టీవీ ఛానల్‌లో ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సమాజ సేవ, ఆర్థిక మార్గదర్శకత్వం, మహిళా సాధికారత, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి విభిన్న రంగాలలో ఆమె అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సేవలను గుర్తిస్తూ ఆమెను “కలం రత్న జాతీయ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం”కు ఎంపిక చేసినట్లు తెలిపారు.
మార్చి 26న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఏనుగు నరసింహ రెడ్డి (ఐఏఎస్), తెలుగు భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు హాజరయ్యారు. గౌరవ అతిథులుగా కోరుకంటి చందర్ (మాజీ ఎమ్మెల్యే, రామగుండం), దేవనపల్లి చక్రపాణి (కార్పొరేటర్, రామగుండం), మధుకర్ (వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు), గుడి కందుల భూమయ్య (అడ్వకేట్) తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, దుర్గ భవాని భవిష్యత్తులో కూడా సమాజ సేవలో మరింత రాణించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *