తేది:26-03-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.
నల్గొండ జిల్లా:ఈరోజు నల్గొండలో నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఘటన చోటుచేసుకుంది. వంశీకృష్ణ అనే ఆటో డ్రైవర్, రాపిడో ద్వారా ప్రయాణించిన ఎండి షకీనా అనే మహిళ తన మొబైల్ ఫోన్‌ను ఆటోలో మర్చిపోవడంతో, 100 డయల్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న 100 కాల్ పోలీసులు తక్షణమే స్పందించి, సంబంధిత వివరాలను సేకరించి, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ సైదులు గారికి సమాచారం అందించారు. అనంతరం ఎస్సై గారు వెంటనే స్పందించి, బాధితురాలి వివరాలను గుర్తించి, ఎస్సై మానస గారి ఆధ్వర్యంలో ఫోన్‌ను సురక్షితంగా ఎండి షకీనా గారికి అందజేశారు.
ఫోన్ తిరిగి పొందిన ఎండి షకీనా కుటుంబ సభ్యులు పోలీసుల వేగవంతమైన చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై సైదులు గారు మాట్లాడుతూ,
వంశీకృష్ణ వంటి నిజాయితీ గల ఆటో డ్రైవర్లు సమాజానికి ఆదర్శం. ఎవరికైనా తెలియని వస్తువులు దొరికినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని సూచించారు.
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆటో డ్రైవర్ వంశీకృష్ణను పోలీసులు అభినందించారు.