గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.

తేది: 25-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా:ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశాల్లో ప్రతిభ కనబరిచి మూడు సీట్లు సాధించారు. గొర్రె రూపేక్ష, వేముల రిషిత్, మునుగూరి సాకేత్ ఈ విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డబ్బా గ్రామ సర్పంచ్ పుప్పాల లక్ష్మి మహేష్, ఉప సర్పంచ్ రాపెల్లి మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తనుగుల రమేష్, వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు డిక్షనరీలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బైండ్ల విశాల్, కనుక నాగరాజు, ముద్దం నరేష్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు మండలజు అశోక్, అల్లకట్టు సత్యనారాయణ, చిలుముల రాజేష్, ఆడెపు నరేష్, అల్లాడి హరిప్రసాద్, బొల్లు శంకర్, జ్యోతి, తల్లిదండ్రులు సురేష్ శ్రావ్య, రాజేశ్వర్, వేముల మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *