తేది:25-03-2026 హనుమకొండ TSLAWNEWS వదిపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ అని పేర్కొన్నారు. నేడు అసెంబ్లీలో మాట్లాతూ, ఇందిరమ్మ రాజ్యం మరియు ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నిజమవుతుందని స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలంటే సొంత ఇల్లు అవసరమని, ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు అందిస్తూ వారికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పేదల కళ్లల్లో కనిపించే ఆనందం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని అన్నారు.గృహప్రవేశ కార్యక్రమాల్లో లబ్ధిదారులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోతో ఇళ్లలోకి ప్రవేశించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి కూడు, గూడు, నీడ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు.వర్ధన్నపేట నియోజకవర్గంలో అధికంగా దళితులు ఉన్నారని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే స్థోమత లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ కంపెనీ సహకారంతో 25 ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు ఎక్కువ ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వర్ధన్నపేట ప్రజల తరపున ఎమ్మెల్యే నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.