తేది:24-03-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: కొండగట్టు అంజన్న ఆలయ దిగువ ప్రాంతంలో ఈనెల 27 నుంచి మే 15 వరకు ‘శ్రీరామ చరితము- సైకత దైవ దర్శనం’ అనే ప్రత్యేక సైకత కళా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఇసుక శిల్పాల రూపంలో అందంగా రూపొందిస్తున్నారు. ప్రతి శిల్పం ఒక కథలా ఉండి భక్తితో పాటు, కళను చూపించనుంది. ఇందులో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న 20 అడుగుల భారీ అద్భుత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.