హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విస్తారక్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్ హాజరై పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తంపై విస్తారక్లకు దిశా నిర్దేశం చేశారు. పాత, కొత్త కలయికతో బూత్ కమిటీ, మండల కమిటీలు పూర్తి చేసి పని విభజన చేయాలని ఆదేశించారు. అటు ఈ నెలాఖరికి జేపీ నడ్డా లేదా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తంపై హైదరాబాద్లో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు లక్ష్యంగా దిశా నిర్దేశం చేయనున్నారు.