తేది:21-03-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్
కానుగుల స్వామి.
నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణం డీఎస్పీ కె. శివరాం రెడ్డి, గారి ఆధ్వర్యంలో నల్లగొండ గత రెండు రోజుల క్రితం అనగా తేది 19-03-2026 రాత్రి సమయంలో నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దేవాలయ హుండీలు పగలగొట్టి, ఆటో, స్కూటీ మరియు సెల్ ఫోన్లు దొంగతనాలు చేసిన నేరస్థున్ని నల్లగొండ II టౌన్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
వివరాల్లోకి వెళితే, నల్లగొండ పట్టణంలోని రామగిరి కి చెందిన మాతంగి సాయి నాధ్ అయ్యప్ప గుడిలో హుండీ ధోంగతనము మరియు తన స్కూటీ మరియు రెండు సెల్ ఫోన్లు ధోంగిలించినారని నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు Crime No.12/2026 కింద U/S 331(4), 305, 305(b) BNS సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయబడింది.
అలాగే పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్.పి శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాల సమాచారంతో నిందితుడిని నల్లగొండ పట్టణ పరిధిలోని సావర్కర్ నగర్ లో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నిందితుని వద్ద నుండి ఒక స్కూటీ, ఒక ఆటో రిక్షా, (2) సెల్ ఫోన్లు, మరియు రూ.3,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుని వివరాలు:
పోలిశెట్టి కార్తీక్ కుమార స్వామి @ కార్తీక్ @ కార్తీక్ కుమార్ @ కుమార స్వామి
తండ్రి: లేట్ పోలిశెట్టి యాదగిరి @ గిరి
వయస్సు: 20 సంవత్సరాలు
వృత్తి: ఆటో డ్రైవర్
చిరునామా: భగత్ సింగ్ నగర్, చింతల్, బాలనగర్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
ప్రస్తుతం నివాసం: మాధవనగర్, ఓల్డ్ సిటీ, నల్లగొండ టౌన్.
నేరం చేయు విధానం:
నిందితుడు పోలిశెట్టి కార్తీక్ కుమార స్వామి పాత నేరస్థుడు. RTC కాలనీలోని శ్రీ కృష్ణ గుడిలో హుండీ పగలగొట్టి సుమారు రూ.3,000/- నగదు దొంగిలించాడు. అదేవిధంగా అదే రాత్రి రామగిరి ప్రాంతంలోని అయ్యప్ప గుడిలో హుండీ దొంగతనానికి ప్రయత్నించగా అది సాధ్యం కాకపోవడంతో, అక్కడ నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న సెల్ ఫోన్లు మరియు ఒక స్కూటీను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.
అలాగే గతంలో ఇతని మీద నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్, సంగారెడ్డి మరియు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో ఇండ్లలో మరియు దేవాలయాల్లో దొంగతనాలకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. గతంలో జైలుకు వెళ్లిన అనంతరం కూడా తన దొంగతనాల అలవాటును మానకపోవడంతో తిరిగి ఇదే విధమైన నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసును నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో, నల్లగొండ II టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్. రాఘవ రావు గారి ఆధ్వర్యంలో, ఎస్.ఐ వై. సైదులు, Md.అహ్మద్ షరీఫ్, ఎస్ఐ, మరియు సిబ్బంది ఎస్.శంకర్, బాలకోటి, ఫరూక్, సతీష్, ప్రదీప్ మరియు హోం గార్డ్ వెంకటేశ్వర్లు కృషి చేసి నిందితుడిని అరెస్టు చేసి కేసును విజయవంతంగా చేదించారు.ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్.పి గారు అభినందించారు.