తేది:19-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్పల్లి రిపోర్టర్ ముజీబ్ పాషా.
మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం పొడిచనపల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని సంప్రదాయ బండ్ల తినే కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు. పండుగ సందర్బంగా గ్రామంలో పల్లె వాతావరణం నెలకొని, ప్రతి ఇంటా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బండ్ల తినే ఆచారాన్ని పాటించడం ద్వారా పాత సంస్కృతిని గుర్తుచేసుకున్నారు.
గ్రామ యువత కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఏర్పాట్లలో సహకరించారు. పరస్పర సహకారంతో, ఐకమత్యంతో పండుగను ఘనంగా జరుపుకోవడం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉగాది పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.