తేది: 18-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే రోజు అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఆకాంక్షించారు. గత సంవత్సరంలోని అనుభవాలను పాఠాలుగా తీసుకుని, కొత్త సంవత్సరాన్ని ఆశావాదంతో ఆహ్వానించాలని అన్నారు. ఉగాది పచ్చడిలాగే ప్రతి ఒక్కరి జీవితం కూడా షడ్రుచుల సంగమంగా మారాలని, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలన్నారు.రైతులు, కార్మికులు, యువత, మహిళలు సహా ప్రతి వర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, ప్రజల ఆశయాలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ ఉగాది పండుగ ప్రతి కుటుంబంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని, రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య తెలిపారు.