తేది :17-03-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ బొంతల రాకేష్.
వరంగల్ జిల్లా : హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎన్ వి రమణ అధ్వర్యంలో మంగళవారం మహా ధర్నాలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య మరియు వివిధ చేతి కులవృత్తుల రాష్ట్ర నాయకులు హాజరై కులవృత్తుల సమస్యలపై గళమెత్తారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నర్సింగరావు హాజరై సంఘీభావం తెలియజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మహా ధర్నాలో మాట్లాడుతూ రజక ఫెడరేషన్ చైర్మన్ ను నియమించి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని,
వృత్తిని ఆధునీకరించే విధంగా ఆధునిక యంత్రాలను సబ్సిడీతో అందించాలని దానితో పాటు 250 యూనిట్ల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతి రజక వృత్తిదారుడికి 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేని ఋణాలు బ్యాంకుల ద్వారా ఇవ్వాలని అలాగే ప్రమాదవశాత్తు వృత్తిదారుడు చనిపోతే 10 లక్షల భీమా సౌకర్యం కింద ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి అంతేకాకుండా 45 సం.లు నిండిన వృత్తిదారుడికి ఫించన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.