తేది:17-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
స్వాతంత్ర సమరయోధులు మునిపల్లి రామచంద్రయ్య లాంటి పోరాట యోధులు పుట్టుక రావాలి, స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చాలి- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు మునపల్లి రామచంద్రయ్య గారు తేది:16-03-2026 రోజున స్వర్గీకృతులైనారు, ఈరోజు స్వతంత్రసమరయోధుడుమునిపల్లి రామచంద్రయ్య గారి స్వగృహం వద్ద వారి యొక్క మృతదేహాన్నికి జాతీయ జెండాతో , పూలమాలలతో నివాళులు అర్పించిన సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్ర కోసం అహర్నిశలు పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుడు మునిపల్లి రామచంద్రయ్య లాంటి యోధులు పుట్టుక రావాలని, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు, అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ స్వతంత్ర సమరయోధుడు మునిపల్లి రామచంద్రయ్య గారి మృతదేహానికి పూలమాలలు వేసి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు, ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం ఎల్లప్పుడూ స్వాతంత్ర సమరయోధుల బాటలో నడుస్తామని తెలియజేశారు. స్వతంత్ర సమరయోధుడు మునిపల్లి రామచంద్రయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సిహెచ్ ఈశ్వర్ గౌడ్, శంకర్పల్లి శ్రీనివాస్ గౌడ్, ఎర్ర సూర్య గౌడ్, హనుమంతు, శ్రీనివాస్ గౌడ్ మరియు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నివాళులు అర్పించారు.