తేది:14-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మున్సిపల్ చైర్మన్గా ఇటీవల ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన కట్కo రవీందర్ ని మున్సిపల్ కార్యాలయంలో శ్రీపతి లక్ష్మీనారాయణ, పవన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ‘సంవిధాన్ మిత్ర ఆర్గనైజేషన్’ వ్యవస్థాపకులు శ్రీపతి పవన్ మరియు శ్రీపతి లక్ష్మీనారాయణ కలిసి మున్సిపల్ చైర్మన్ కట్కo రవీందర్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠిక ప్రతిని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన భారత రాజ్యాంగ పీఠికలోని సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి మూలాలను స్థానిక పాలనలో ఆచరణలో పెట్టాలని కోరారు. ప్రతి వర్గానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందేలా మున్సిపల్ పాలన సాగించాలని సూచించారు.
పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల విస్తరణ, యువత మరియు మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ పీఠికలోని ఆశయాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని కూడా కోరారు.
మున్సిపల్ చైర్మన్ కట్కo రవీందర్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పారదర్శకంగా పనిచేస్తూ ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇస్తానని, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.