తేది:14- 03- 2026 TSLAWNEWS హైదరాబాద్ ఇన్చార్జి విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ సేవ న్యూస్ రిపోర్టర్ ఉగాది పురస్కారం – 2026కు ప్రముఖ సామాజిక కార్యకర్త, మీడియా ప్రతినిధి పారువెల్లి అంక విజయ దుర్గ భవాని ఎంపికయ్యారు. ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మార్చి 15వ తేదీ ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆమె మీడియా రంగంలో న్యూస్ రిపోర్టర్‌గా సేవలు అందిస్తూ సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమాజ సేవలో చురుకుగా పాల్గొంటూ మానవ హక్కులు మరియు వినియోగదారుల హక్కులు పరిరక్షణలో కూడా విశేష సేవలు అందిస్తున్నారు.
అదేవిధంగా ఆమె సైబర్ సోల్జర్‌గా సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఆన్‌లైన్ మోసాల నుండి రక్షించుకునేలా చైతన్యం కల్పిస్తున్నారు. అలాగే ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో సీనియర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ ప్రజల్లో ఆర్థిక భద్రత మరియు హెల్త్ అండ్ జెనరల్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు.
సమాజానికి ఆమె అందిస్తున్న బహుముఖ సేవలను గుర్తించి ఎం.వి. రావు ఫౌండేషన్ ఈ ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ సేవ న్యూస్ రిపోర్టర్ ఉగాది పురస్కారం – 2026కు ఆమెను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు హాజరై పురస్కార గ్రహీతలను అభినందించనున్నారు.