వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనను భూస్థాపితం చేస్తామని బాబు ఇది పిక్స్ ఐపోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. బాబుకు సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే పవన్ ను కలుపుకున్నారన్నారు. జైలుకు వెళ్ళొచ్చిన తరువాత చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘పవన్ కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలి? గతంలో మీరు కలిసి పోటీ చేసి ఎందుకు విడిపోయారు? మీది కలహాల కాపురం అని తేలి పోయిందన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ అసలు ఎక్కడ ఉంటారు? సీఎం ఐతేనే చంద్రబాబు అసెంబ్లీ కి వస్తారా? నాకు సీటు ఇవ్వకపోయినా పక్కచూపులు చూడనన్నారు. జగన్ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను’ అని అంబటి స్పష్టం చేశారు. వైసీపీకి 175 సీట్లు ఖాయమన్నారు. టీడీపీ,జనసేన పార్టీలను తుక్కుతుక్కుగా ఓడిస్తామన్నారు. మరోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంబటి జోస్యం చెప్పారు.