తేది:13-03-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళి కృష్ణ.
హైదరాబాద్: బబ్బుగూడ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఈద్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈద్ ముబారక్ కిట్లను ఈరోజు మజీద్ వద్ద పేద ముస్లిం మహిళలకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ పేద ముస్లిం కుటుంబాలకు ఈద్ ముబారక్ కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మూసాపేట కాంటెస్తేడ్ కార్పొరేటర్ గోపిశెట్టి రాఘవేందర్ , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లయన్ అన్నెం కోటి రెడ్డి , ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ బాకారం బుచ్చయ్య , పోచమ్మ తల్లి కమిటీ సభ్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా మజీద్ కమిటీ సభ్యులు ఇమ్రాన్, ఇస్మాయిల్, సలీం, నయీమ్, రాజేష్, శ్రీను, ఇర్ఫాన్, వసీం, గోపాల్ చౌదరి, కమరుద్దీన్, ఆనంద్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రవి గౌడ్, నరసింహులు, ప్రతాప్, వెంకటేష్ గౌడ్, షకీర్, రంగప్ప, కురువ రాజు, ప్రసాద్, శివ, సత్విక్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈద్ పండుగ ఆనందాన్ని పేద కుటుంబాలతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.