తేది:13-03- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బొప్పాన్ పల్లి పాఠశాలలో గురువారం నాడు ‘స్వయం పరిపాలన దినోత్సవం’ అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారమెత్తి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు.
నిత్యం పాఠాలు వినే విద్యార్థులు, ఈ రోజు ఉపాధ్యాయులుగా మారి తరగతులకు వెళ్లారు. పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, పాఠశాల క్రమశిక్షణను పర్యవేక్షించడంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఇది తమకు ఎంతో ఆనందాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
పాఠశాల ఉపాధ్యాయురాలు రాధిక మరియు ప్రధానోపాధ్యాయులు మంజుల మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. “విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణను అలవర్చుకుని, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు” అని ఆయన ఉద్ఘాటించారు. గ్రామ సర్పంచ్ అమృత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ అనిల్ పాటిల్ ఉపసర్పంచ్ రాములు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు వసంత లక్ష్మి,మాజీ సర్పంచ్ బాలయ్య, మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ షకీల్,వార్డ్ మెంబర్లు శిరోమణి, సురేఖ,దస్తమ్మ, ప్రవీణ్ మరియు గ్రామ పెద్దలు సుధాకర్, వెంకట్, రాములు, రాజు మైబుజాని,గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్, నమస్తే ఇందూర్ రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.