కరోనా వైర్‌సను నిరోధించే వ్యాక్సిన్‌ అభివృద్ధిపై హైదరాబాద్‌ యూనివర్సిటీ

కరోనా వైర్‌సను నిరోధించే వ్యాక్సిన్‌ అభివృద్ధిపై యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. అందుకు అనువైన టి8సెల్‌ ఎపిటోప్స్‌ను రూపొందించింది.  పరిశోధన వివరాలపై తుది అంచనాకు వచ్చేందుకు దీనిని  ఇతర శాస్త్రవేత్తలకు అందజేసినట్లు యూనివర్సిటీ తెలిపింది. కరోనావైర్‌సకు సంబంధించిన చిన్న మాలిక్యుల్స్‌ను పరిశోధనశాలలో రూపొందించి, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వైరస్‌ కణాలను నాశనం చేయడానికి ప్రయత్నించినట్లు  యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన సీమా మిశ్రా తెలిపారు. ఇమ్యూనిటీని పెంచే క్రమంలో ఈ  వాక్సిన్లు హ్యూమన్‌సెల్స్‌కు ఏమాత్రం హాని చేయని విధంగా తయారు చేసినట్లు ఆమె చెప్పారు. 

అయితే ఫలితాలను ప్రయోగాత్మకంగా నిర్ధారించుకున్న తరువాత మాత్రమే ఒక అంచనాకు రాగలుగుతాం అని సీమా మిశ్రా తెలిపారు. భారతదేశంలో కరోనా వాక్సిన్‌ తయారీ దిశగా జరుగుతున్న తొలి ప్రయోగం తమదేనని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ పేర్కొంది.  ప్రస్తుతానికి కరోనాను నివారించడానికి సామాజిక దూరాన్ని పాటించడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. వాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని, తమ ప్రయోగాలు ఈ సమయాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *