భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య.

తేది:12-3-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : మల్కాజిగిరి, మార్చ్ 12 నేరేడ్మెట్,భార్య వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ లక్ష్మీనగర్‌లో నివసించే నగెల్లి శ్రీనివాస్ (41) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్.
శ్రీనివాస్ 2012లో సట్లపల్లి జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. భార్య గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి శ్రీనివాస్ ప్రోత్సాహం అందించాడు. తర్వాత జ్యోతి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఇటీవల పదోన్నతిపై ఎక్సైజ్ సీఐగా నియమితులయ్యింది.
ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తను దూరం పెట్టడమే కాకుండా, శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు, విడాకుల కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం. దీంతో గత నాలుగు నెలలుగా శ్రీనివాస్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. కోర్టు కేసులు, భార్య వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ‘భార్య వేధింపులు, కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా అతను మృతిచెందినట్లు గుర్తించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోదరుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ భార్య జ్యోతి సహా మరో 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *