తేది :12-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిని నిర్దేశిత లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం మరియు స్థానిక అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తెలిపారు. గురువారం 1వ డివిజన్ పరిధిలో రూ.1.35 కోట్ల నిధులతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి డివిజన్‌లో ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలిపారు.నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ABC కేటగిరీలుగా గుర్తించి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రులతో సమన్వయం చేస్తూ వర్ధన్నపేట నియోజకవర్గంలో కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.డివిజన్‌లలో కార్పొరేటర్లు మరియు స్థానిక నాయకత్వం ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తూ తమ దృష్టికి తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలమని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వరుణగంటి అరుణకుమారి, కాంగ్రెస్ నాయకులు దేవరకొండ అనిల్, కాంగ్రెస్ నాయకులు కొంక హరిబాబు, గడ్డం శివరాం ప్రసాద్, చిర్ర రాము, రవి యాదవ్, నన్నబోయిన రమేష్ యాదవ్, అరుణ్, కమలాకర్ తో పాటు డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.