తేది:12-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా : హైదరాబాద్ నాంపల్లి లోని గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్‌గా ఇటీవల ఎన్నికై నేడు ప్రమాణ స్వీకారం చేపట్టిన మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , గడ్డం వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ , టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి కవ్వంపల్లి సత్యనారాయణ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు. సహచర ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో తాను మరియు సత్యనారాయణ కలిసి హాకీ ఆడిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ తమ మధ్య ఉన్న స్నేహ బంధం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా నాయకులు, కార్యకర్తలు అండ ఉంటూ 6 ఏండ్ల కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా పని చేయగా గౌరవ సీఎం రేవంత్ రెడ్డీ గొప్ప ఆలోచనతో ఎస్సీ సెల్ ను డెవలప్మెంట్ చేయాలని గొప్ప సంకల్పంతోనే సత్యనారాయణ గారికి బాధ్యతలు అప్పగించడం సంతోషకరం. గతంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ప్రీతం ఆధ్వర్యంలో బలమైన కమిటీలు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను ముందుకు తీసుకెళ్లారని అన్నారు. కష్టకాలంలో కూడా ప్రీతం ఎస్సీ సెల్‌ను బలోపేతం చేస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ పనిచేశారని కొనియాడారు. దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని, రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే లక్ష్యంగా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మాజీ మంత్రి పుష్పలీలా, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, జేబి రాజు, మోత్కుపల్లి నర్సింహులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్సీ విభాగం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు కొంక హరిబాబు, గడ్డం శివరాం ప్రసాద్, చిర్ర రాము తదితరులు హాజరయ్యారు.