ప్రజా ప్రతినిధులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం.

తేది:12-03-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజకవర్గ రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా:పట్టణంలోని గౌళికర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గారు సర్పంచులు, కౌన్సిలర్లు, ఉపసర్పంచుల కోసం ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ స్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలాగే గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం, తాగునీరు, పర్యావరణ పరిరక్షణ, పన్నుల వసూలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *