ఇంద్రేశం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

తేది:11-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా : మార్చి 11, 2026 ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఇంద్రేశం గ్రామ శివారులోని దుర్గారెడ్డి వ్యవసాయ పొలం పక్కన ఉన్న మూన్ సిటీ వెంచర్ ప్రాంతంలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్యగా ఉంటుందని అంచనా. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ముఖం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
మృతుడి కుడి భుజంపై హనుమాన్ టాటూ ఉండగా, ఛాతి మీద “Mom Dad” అనే టాటూ కనిపించింది. కుడి చేతికి మెటల్ కడియం ధరించి ఉండగా, మెడలో గదా ఆకారంలో తాయత్తు ఉంది. మృతుడి ఒంటిపై బ్లాక్ కలర్ టీ-షర్ట్ మరియు బ్లాక్ కలర్ ఫుల్ నిక్కర్ ఉన్నాయి.
ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
సంప్రదించవలసిన నంబర్లు: 📞 87126 61839, 87125 83468

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *